మూడు రోజులు.కూలీ పనులకు.మూడు రోజులు బడికి వెళ్తూ పదవ తరగతి ఫలితాల్లో 509 మార్కులు
చిప్పగిరి,23 ఏప్రిల్ (హిం.స): కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్ప
నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


నవీన


చిప్పగిరి,23 ఏప్రిల్ (హిం.స): కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తండ్రి వ్యవసాయ కూలీ. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇంటి పరిస్థితి గమనించిన నవీన వారంలో మూడు రోజులు కూలి పనులకు వెళ్తూ.. మూడు రోజులే బడికి వెళ్తోంది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికకు శ్రద్ధను చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఫీజులు, పుస్తకాలు అందిస్తూ.. చేయూతనిచ్చారు. సోమవారం వచ్చిన పదో తరగతిలో ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా అత్యధిక మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకుంది.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande