ఎంపీ సాబ్ ప్రజల్ని ఎన్నడైనా పట్టించుకున్నావా..?
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:23(హిం స)గత ఐదేళ్లలో పార్లమెంటు సభ్యుడిగా ఏ ఒక్కటైనా రంగారెడ్డ
*ఎంపీ సాబ్ ప్రజల్ని ఎన్నడైనా పట్టించుకున్నావా..?*


తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:23(హిం స)గత ఐదేళ్లలో పార్లమెంటు సభ్యుడిగా ఏ ఒక్కటైనా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యావా? కనీసం ఓ మండల పరిషత్ సమావేశానికైనా ముఖ్యఅతిథిగా వచ్చావా..? ఏ మొహం పెట్టుకుని షాద్ నగర్ ప్రజలను ఓట్లు అడుగుతున్నావ్ అంటూ షాద్ నగర్ నియోజకవర్గం

ఫరూక్ నగర్ జడ్పీటిసి పి. వెంకట్రామిరెడ్డి మీడియా ముఖంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉండేది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని పార్టీలు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మన్నే శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గంలో ఎంత మంది నిరుద్యోగులకు ఆయన ఉద్యోగాలు ఇచ్చి వెలగబెట్టారో చెప్పాలని వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. గత ఐదేళ్లు నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం నడుంబిగించిన దాఖలాలు లేవని వివరించారు. తాను కూడా అదే పార్టీ నుండి వచ్చిన వాడిని కానీ ఏనాడు ఆయన జాడ కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గానికి ఎన్ని నిధులు సమకూర్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి బతుకు భరోసా కల్పించారు? మన్నే శ్రీనివాస్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. ఎంపీగా గెలిచి ఉడాయించాడంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఓట్లు పొందడానికి ప్రజల ముందుకు రావడం సిగ్గుచేటని వెంకటరామ్ రెడ్డి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తీరుపై విమర్శల వర్షం కురిపించారు. అభివృద్ధి కోసమే తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరగలేదనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని వెంకటరామిరెడ్డి అన్నారు. ఇదంతా చూస్తూ మళ్ళీ బుద్ధిలేని మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడుతుండడం హాస్యాస్పదమని వెంకటరామిరెడ్డి నిప్పులు కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కొన్ని నెలలే అవుతుందని ఇప్పుడే రాష్ట్రమంతటా అభివృద్ధి చేయలేదని ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని అన్నారు. మళ్లీ పూర్వ అభివృద్ధి సంగతి దేవుడెరుగు ఎవరెవరు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము ఎంత వెనుక వేసుకున్నారో, ఎవరి స్వార్థం కోసం ఎంత సంపాదించారో? గత ప్రజాప్రతినిధుల జీవిత చరిత్రలు ఆర్థిక విధ్వంసం ఎంత సృష్టించారో ప్రజలకు తెలుసని, వారు అభివృద్ధి గురించి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని వెంకటరామిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకొని ఎంపీ శ్రీనివాస్ రెడ్డి వచ్చాడని అసలు ఓట్లు అడిగే హక్కు బిఆర్ఎస్ అభ్యర్థికి లేదని వెంకటరామిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఎంపీ శ్రీనివాస్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదని అనవసరంగా పోటీ చేసి పరువు పోగొట్టుకోవద్దని హితవు పలికారు.

జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande