ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న మమతా ప్రభుత్వం... బిజెపి చీఫ్ జెపి నడ్డా
పశ్చిమబెంగాల్ ఏప్రిల్ 28 (హిం.స)పశ్చిమబెంగాల్లోని మమతా ప్రభుత్వం ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలన
ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న మమతా ప్రభుత్వం... బిజెపి చీఫ్ జెపి నడ్డా


పశ్చిమబెంగాల్ ఏప్రిల్ 28 (హిం.స)పశ్చిమబెంగాల్లోని మమతా ప్రభుత్వం ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటుందా..? అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. ఆయన సందేశాఖాలీలో ఆయుధాల స్వాధీనంపై స్పందిస్తూ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో భాజపా 35 నుంచి 42 వరకు లోక్సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీఎంసీ మాజీ నాయకుడు షాజహాన్ షేక్ అరాచకాలకు గురైన బాధిత మహిళలకు నడ్డా సంఘీభావం తెలిపారు. షాజహాన్ షేక్ బాధితుల్లో ఒక మహిళకు లోక్సభ టికెట్ కూడా ఇచ్చామన్నారు. భయపెట్టి విజయం సాధించాలనుకుంటే మమత బెనర్జీకి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆమెకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇటీవల సందేశాఖాలీలో షాజహాన్కు చెందిన ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. వీటిల్లో విదేశీ తయారీ రివాల్వర్, ఇతర ఆయుధాలు ఉన్నాయి. జనవరిలో ఈడీపై జరిగిన దాడికి సంబంధించి ఈ సోదాలను నిర్వహించింది. ఇదే అంశంపై నిన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ సీబీఐ ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవన్నారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande