జగన్ ప్రభుత్వంలోనే క్షత్రియులకు అధిక ప్రాధాన్యం: మంత్రి అమర్నాథ్ వెల్లడి
విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 28(హిం.స): జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనే క్షత్రియులకు అధిక ప్రా
జగన్ ప్రభుత్వంలోనే క్షత్రియులకు అధిక ప్రాధాన్యం: మంత్రి అమర్నాథ్ వెల్లడి


విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 28(హిం.స): జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనే క్షత్రియులకు అధిక ప్రాధాన్యత లభించింది అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక కూర్మన్నపాలెంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ మాజీ చైర్మన్ వి.వి.ఎన్.ఎం.రాజా అధ్యక్షుడు వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అమర్నాథ్ మాట్లాడారు. తన తండ్రి గురునాథరావు మంత్రిగా పనిచేసినప్పుడు ఉత్తరాంధ్రలో క్షత్రియలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించారని చెప్పారు. 2019 ఎన్నికల్లో క్షత్రియులకు ఐదు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించారని, ఈ ఎన్నికల్లో ఐదుగురికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా అందులో విశాఖ జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉన్నారని అమర్నాథ్ తెలియజేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు క్షత్రియులకు ఎమ్మెల్సీ పదవులు కూడా ఇచ్చి వారిపట్ల ఉన్న గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి చాటుకున్నారని అమర్నాథ్ వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీలో నలుగురు క్షత్రియులకు రాష్ట్ర కార్యదర్శి పదవులు కూడా ఇచ్చారని చెప్పారు. అలాగే ప్రసాద్ రాజును చీఫ్ విప్పుగా నియమించారని, వీటన్నిటికీ మించి జిల్లాల విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అదే జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా పనిచేయడం తన అదృష్టమని అమర్నాథ్ పేర్కొన్నారు. అంతే కాకుండా అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని పాడేరులో ఏర్పాటుచేసి ఆయన స్ఫూర్తిని నింపుకున్నామని అమర్నాథ్ చెప్పారు. తనను తమ బిడ్డగా భావించి ఈ ఎన్నికల్లో గెలిపించాలని, ఏ సమస్య వచ్చినా ఆదుకోవడానికి తన సిద్ధంగా ఉంటానని క్షత్రియ పద్ధతులకు అమర్నాథ్ చెప్పారు. క్షత్రియ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని అమర్నాథ్ హామీ ఇచ్చారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్షత్రియులకు రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుందని అమర్నాథ్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గంలో పలువురు క్షత్రియలకు కీలక బాధ్యతలు అప్పగించారని అన్నారు

. ఈ సమావేశంలో క్షత్రియ పెద్దలు మాట్లాడుతూ గుడివాడ కుటుంబానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఈ ఎన్నికల్లో అమర్నాథ్ విజయానికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అమర్నాథ్ను క్షత్రియ సంప్రదాయ రీతిలో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక నియోజకవర్గం పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి ,కార్పొరేటర్ ఊరుకూటి చందు, భూపతిరాజు శ్రీనివాసరాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరుకూటి అప్పారావు, సుబ్బరాజు, చిట్టిబాబు ఎం.ఆర్.కే.రాజు, మంత్రి రాజశేఖర్, ప్రసాద్ రాజు, దామా సుబ్బారావు, బంగారురాజు తదితరులు పాల్గొన్నారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande