కదిలి రండి... బంగారు భవిష్యత్తు కోసం ఓటేద్దాం...: ఎలక్షన్ అబ్జెర్వర్ అమిత్ శర్మ
విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 28(హిం.స): ఓటరు మహాశయులారా కదిలి రండి.. మే 13న జరిగే ఎన్నికల పండుగ
కదిలి రండి... బంగారు భవిష్యత్తు కోసం ఓటేద్దాం...: ఎలక్షన్ అబ్జెర్వర్ అమిత్ శర్మ


విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 28(హిం.స): ఓటరు మహాశయులారా కదిలి రండి.. మే 13న జరిగే ఎన్నికల పండుగలో భాగస్వామ్యం కండి.. బంగారు భవిష్యత్తు కోసం ఓటేద్దాం అని ఎలక్షన్ అబ్జెర్వర్ అమిత్ శర్మ, జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. ఉత్సుకత ప్రదర్శించాలని... శతశాతం ఓటింగే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కదలి రావాలని విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక బీచ్ రోడ్లో నిర్వహించిన 5కె రన్ ర్యాలీ ప్రారంభోత్సవంలో వారు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. వారిలో స్ఫూర్తి నింపుతూ ఉత్సాహంగా ప్రసంగించారు. లెట్స్ ఓట్ ఫర్ డెమొక్రసీ, లెట్స్ ఓట్ ఫర్ ఫ్యూచర్ అనే నినాదాలను ఓటర్లతో చేయించారు.

ప్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 5కె రన్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అధికారులు, యువ ఓటర్లు టీ షర్టులు, టోపీలు ధరించి ముందుకు సాగారు. విశ్వప్రియ పంక్షన్ హాలు నుంచి పాం బీచ్ వరకు సాగిన ర్యాలీ మళ్లీ అదే రూట్లో విశ్వప్రియ పంక్షన్ హాలు దాగా సాగి అక్కడ ముగిసింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, జనరల్ అబ్జర్వెర్ అమిత్ శర్మ, వ్యయ పరిశీలకులు రెంగ రాజన్, సౌమ్య పాండే జైన్, పోలీసు జాయింట్ కమిషనర్ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్ ఇతర అధికారులు ఉత్సాహంగా 5కె రన్ సాగించారు. దీనికి ముందు యువ ఓటర్లు, కళాకారులు ఓటరు చైతన్యానికి సంబంధించి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లు కూడా కార్యక్రమంలో పాల్గొని ఇతరుల్లో స్ఫూర్తి నింపారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి రామారావు, వివిధ నియోజకవర్గాల ఆర్.వో.లు, జిల్లా స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువ ఓటర్లు పాల్గొన్నారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande