కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
బెళగావి: ఏప్రిల్ 28 (హిం.స) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. రాజులు, మహా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు


బెళగావి: ఏప్రిల్ 28 (హిం.స)

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. రాజులు, మహారాజులను అవమానించిన ఆయన.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని అన్నారు. బెళగావిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్ రాయించిందన్నారు.

''కాంగ్రెస్ యువరాజు నేటికీ ఆ పాపాలను కొనసాగిస్తున్నారు. రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని ఆయన (రాహుల్) ఆరోపించారు. తద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్, కిట్టూరు రాణి చెన్నమ్మ వంటి మహానుభావులను అవమానించారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే అటువంటి ప్రకటనలు చేశారు. కానీ, దేశ చరిత్రలో నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాదీలు చేసిన దౌర్జన్యాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు'' అని మోదీ విమర్శించారు.మొగల్ చక్రవర్తి ఔరంగజేబు అణచివేతల గురించి రాహుల్ మరచిపోయారన్న మోదీ.. ఎన్నో దేవాలయాలను అపవిత్రం చేసి, ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తిని ప్రశంసించే వారితో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడం విచారకరమన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన దాడులు సిగ్గుచేటన్నారు. ఇవి కర్ణాటక కీర్తిని దిగజారుస్తున్నాయని అన్నారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande