జిల్లాలో రూ.1,53,83,000/- నగదుసీజ్: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
, 28 ఏప్రిల్ (హిం.స)హైదరాబాద్, ఏప్రిల్ 28: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో భాగంగా జిల్లాలో ఏర్పా
జిల్లాలో రూ.1,53,83,000/- నగదుసీజ్: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్


, 28 ఏప్రిల్ (హిం.స)హైదరాబాద్, ఏప్రిల్ 28: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో ఒక కోటి 53 లక్షల 83 వేల రూపాయల నగదు,

77 లక్షల 52 వేల 942 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 23.37 లీటర్ల మద్యంను పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

ఈ సందర్భంగా నగదు, ఇతర వస్తువుల పై 11 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కారం చేశారని,6

ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం19,03,52,085/- రూపాయల నగదు, 8,22,73,049/- రూపాయల విలువ గల వస్తువులు వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పట్టుకొని సీజ్ చేశారని,

21,422. 87 లీటర్ల అక్రమ మద్యంను పట్టుకొని 244 కేసులు నమోదు చేసి 242 మందిని అరెస్ట్ చేసినట్లు డిఇఓ పేర్కొన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా 3 కోట్ల 92 లక్షల 42 వేల 935 రూపాయలు, రూ.

28,64,550/- విలువైన ఇతర వస్తువులు,

ఇతర పోలీస్ అథారిటీ/ ఐటి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 14 కోట్ల 89 లక్షల 20 వేల 600/- రూపాయల నగదు,

రూ.7,17,08,500/- విలువగల వస్తువులు,

ఎస్ ఎస్ టి బృందాలు రూ.21,88,550/-నగదు

రూ.77,00,000/- విలువ గల వస్తువులు పట్టుకొన్నారని ఆయన వివరించారు.

ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన నగదు ఇతర వస్తువులపై 512 ఫిర్యాదులు రాగా పరిశీలించి అన్నింటిని పరిష్కరించారని, 333 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. 3024

లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా ఎం సి సి ఉల్లంఘనలపై 23 ఫిర్యాదులు రాగా, అన్నింటిపై చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్


 rajesh pande