వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు ,భారత్ నుంచి వెళ్లిపోతాం:
న్యూ ఢిల్లీ 28, ఏప్రిల్ (హిం.స)కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్ను సవాల్ చేస్తూ వాట్సాప్, మెట
వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు ,భారత్ నుంచి వెళ్లిపోతాం:


న్యూ ఢిల్లీ 28, ఏప్రిల్ (హిం.స)కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్ను సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది.

ఈ సందర్భంగా వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ ప్లాట్ఫాంలో మెసేజ్లకు ఉన్న ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని ఆదేశాలిస్తే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.

ఎన్క్రిప్షన్ తొలగించడమనేది వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని వాట్సాప్,మెటా ఆరోపించాయి.

ముఖ్యంగా మెసేజ్ సెండర్ వివరాలను ట్రేస్ చేసే నిబంధనను సవరించాలని కోరాయి. విచారణ సందర్భంగా వాట్సాప్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మెసేజ్ల గోప్యత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని మేం అమలు చేస్తున్నాం.

సీక్రెసీ(రహస్యభద్రత) ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనల్లోని 4(2) సెక్షన్తో మేం ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు గనుక చెబితే మేం ఇండియా నుంచి వెళ్లిపోతాం’అని కోర్టుకు స్పష్టం చేశారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande