సీఎం రేవంత్ రెడ్డి పై మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య మండి పాటు
హైదరాబాద్, ఏప్రిల్ 29: (హిం.స) బీఆర్ఎస్ సచ్చిన పాము అని ముఖ్యమంత్రి అంటున్నారని.. కేవలం 1.85 శాతం ఓట
సీఎం రేవంత్ రెడ్డి పై మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య మండి పాటు


హైదరాబాద్, ఏప్రిల్ 29: (హిం.స)

బీఆర్ఎస్ సచ్చిన పాము అని ముఖ్యమంత్రి అంటున్నారని.. కేవలం 1.85 శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చచ్చిన పాము ఎట్లా అవుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీమ్ వర్క్, హోం వర్క్ రెండూ లేవన్నారు. కేసీఆర్ రాజకీయ చరిత్రకు... రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్రకు అసలు ఏమైనా సంబంధం ఉందా అని నిలదీశారు. కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి అనుభవం ఎంత అని అన్నారు.

రైతు బంధు, రైతు రుణమాఫీ చేయలేని వ్యక్తి సీఎంగా ఉన్నారని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదన్నారు. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే తాము వద్దు అన్నామా అని అన్నారు. రైతుబంధు ఐదు లక్షలమందికి ఇవ్వలేదని రేవంత్ రెడ్డే స్వయంగా అన్నారన్నారు.

వాళ్ళు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలన్నారు. వెదిరె శ్రీరామ్

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని..

కేంద్ర జలవనరుల శాఖలో ఆయన కీలకమైన స్థానంలో ఉన్నప్పుడే కాళేశ్వరంకు అనుమతి వచ్చిందని.. అప్పుడు ఏం చేశారని పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande