గత ఐదెళ్లుగా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి న్యాయం జరగలేదని టిడిపి చంద్రబాబు
నంద్యాల, 30 ఏప్రిల్ (హిం.స)): గత ఐదేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికీ న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చం
c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


నంద్యాల, 30 ఏప్రిల్ (హిం.స)): గత ఐదేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికీ న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ వారి పాలిట రాక్షసుడిలా మారారని ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎ్స)పై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు న్యాయం చేస్తామని.. పీఆర్సీ, పింఛన్ సకాలంలో ఇచ్చి అండగా ఉంటామని వెల్లడించారు. ప్రజాగళంలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా డోన్, నందికొట్కూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లుగా సచివాలయానికి వెళ్లని సీఎం, ఐదేళ్లలో ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించని సీఎం జగన్ తప్ప దేశంలో మరెవరూ లేరన్నారు. సొంత ప్రయోజనాల కోసం కేబినెట్ను పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకొచ్చి ప్రజల ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారని.. బంగారు భవిష్యత్ ఉన్న యువతకు ఉద్యోగాలివ్వకుండా వారి జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. సైకో జగన్రెడ్డికి ఒళ్లంతా అహంకారం పెరిగిపోయి, వ్యవస్థలను ధ్వంసం చేశారని.. అభివృద్ధిని విచ్చిన్నం చేసి, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘డ్రగ్స్ రాష్ట్రంగా మార్చి యువతను గంజాయికి బానిసలుగా మార్చేస్తుంటే బాధగా ఉంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క రైతయినా బాగుపడ్డాడా? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? ఏ ఒక్క వర్గమైనా బాగుపడిందా? వ్యవసాయాన్ని నాశనం చేశాడు. అన్నదాతల గొంతు నొక్కేయడంతో వారంతా దీనావస్థలో పడ్డారు. హార్టికల్చర్ను పూర్తిగా నాశనం చేశాడు’ అని దుయ్యబట్టారు. జగన్ దోపిడీ దొంగ అని, సొంత బాబాయిని చంపి చెల్లెలి మీద కేసు పెట్టిన వ్యక్తికి ఓటు వేయకుండా ఇంటికి సాగనంపాలని పిలుపిచ్చారు. మే 13న ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఇంకా ఏమన్నారంటే..

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande