ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్
బెంగళూరు: 30,ఏప్రిల్ (హిం.సహాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్న
ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్


బెంగళూరు: 30,ఏప్రిల్ (హిం.సహాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే..ఈ పరిణామానికి ముందు ప్రజ్వల్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande