'అసహనంతోనే ఫేక్ వీడియోలు' :అమిత్ షా
న్యూ డిల్లీ 30,ఏప్రిల్ (హిం.స రిజర్వేషన్ల రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) చెప్పినట్లు
'అసహనంతోనే ఫేక్ వీడియోలు' :అమిత్ షా


న్యూ డిల్లీ 30,ఏప్రిల్ (హిం.స రిజర్వేషన్ల రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) చెప్పినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అమిత్ షా దీనిపై స్పందిస్తూ.. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ అసహనంతోనే ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని మండిపడ్డారు. తమ మాటలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు భాజపా వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు.

‘‘400 సీట్లు దక్కించుకున్న తర్వాత భాజపా రిజర్వేషన్లను రద్దుచేస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆ మాటలన్నీ నిరాధారమైనవి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు మా పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేస్తున్నాను. నాతోపాటు మా పార్టీకి చెందిన ఇతర నేతల నకిలీ వీడియోలను ప్రచారం చేసే స్థాయికి వారి అసహనం పెరిగిపోయింది. ముఖ్యమంత్రులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇతరులు ఈ ఫేక్ వీడియోను వ్యాప్తి చేశారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande