విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి సీపీ తరుణ్ జోషి ఐపిఎస్
హైదరాబాదు 30ఏప్రిల్ (హిం.స) రాచకొండ పోలీసు కమిషనరేట్ లో ఈ రోజు సాధారణ పదవీ విరమణ చేసిన పోలీస్ అధికార
విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి  సీపీ తరుణ్ జోషి ఐపిఎస్


హైదరాబాదు 30ఏప్రిల్ (హిం.స) రాచకొండ పోలీసు కమిషనరేట్ లో ఈ రోజు సాధారణ పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులు ఎస్బి అడిషనల్ డీసీపీ రఫీక్, సబ్ ఇన్స్పెక్టర్ యాదయ్య, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సయ్యద్ అహ్మద్, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ యలద్రి లను నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సీపీ డాక్టర్ తరుణ్ జోషి, ఐపిఎస్., గారు సన్మానించారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ... ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో సుధీర్ఘ కాలంగా అంకితభావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియజేశారు. కర్తవ్య నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగం చేసి శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో కుటుంబసభ్యుల పాత్ర ఎంతో ఉంటుందని, రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, వీలైతే సమాజసేవలో పాలు పంచుకోవాలన్నారు. పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులు అందరూ తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేశారని మెచ్చుకున్నారు. రిటైర్ మెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బులను జాగ్రత్తగా ఖర్చు చేయాలన్నారు. ఈ సందర్భంగా కో ఆపరేటివ్ సొసైటీ బెనిఫిట్ నుండి ఒక్కొక్కరికి 30,000/- మరియు వారి పొదుపు డబ్బుకు సంబంధించిన చెక్కులను సయ్యద్ అహ్మద్ కు 2,21,371, బి.యాదయ్య కు 2,18,462 మరియు టీ. యలద్రి కి 2,36,460/- సీపీగారు అందచేశారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిర మాట్లాడుతూ పదవీ విరమణ చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఆరోగ్యం పట్లశ్రద్ధ వహించాలని, వారికి పోలీసు శాఖ తరఫున అందాల్సిన ఇతర ప్రయోజనాలు అన్నీ త్వరగా అందేలా చూస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పదవీ విరమణ చేయనున్న అదనపు డీసీపీ రఫీక్ గారు మాట్లాడుతూ.. పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేసి రాచకొండ కమిషనరేట్ పరిధిలో పదవీ విరమణ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ళ విధి నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా, ఉన్నతాదికారుల సూచనల ప్రకారం పనిచేసి వారి మన్ననలు పొంది సాధారణ పదవీ విరమణ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తనతో పాటు పదవీ విరమణ చేస్తున్న ఇతర అధికారులకు అభినందనలు తెలియజేశారు.

తదనంతరం దివంగత రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ బస్వరాజు యాదవ్ కుటుంబానికి ఏడు లక్షల రూపాయల భద్రత చెక్కులను కమిషనర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీ గారితో పాటు అడ్మిన్ డీసీపీ ఇందిర, ఎస్బి డీసీపీ కరుణాకర్, ఏసిపిలు శ్రీధర్ రెడ్డి, రమేష్, CAO అకౌంట్స్ శ్రీమతి సుగుణ, CAO అడ్మిన్ పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్ భద్రా రెడ్డి, కో ఆపరేటివ్ సొసైటీ ట్రెజర్ బాలరాజు, డైరెక్టర్ సువర్ణ, కుటుంబ సభ్యులు కమిషనరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande