భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు
దిల్లీ: 02,మే ,(హిం.స) సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల
భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు


దిల్లీ: 02,మే ,(హిం.స) సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. బుధవారం వీరితో భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు. దేశ ఎన్నికల ప్రక్రియ, పార్టీ ప్రచార వ్యూహాల గురించి విదేశీ ప్రతినిధులతో భాజపా ప్రధాన కార్యాలయంలో చర్చించినట్లు జె.పి.నడ్డా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. లోక్సభ ఎన్నికల వేళ తమ పార్టీ ప్రారంభించిన ‘భాజపాను తెలుసుకోండి’ కార్యక్రమంలో భాగంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. భాజపా సాధించిన విజయాలతోపాటు దేశ నిర్మాణం కోసం తమ పార్టీ చేసిన కృషిని, త్యాగాలను ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నడ్డా వివరించారు. ఆస్ట్రేలియా, రష్యా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇజ్రాయెల్, ఉగాండా, టాంజానియా, శ్రీలంక, నేపాల్, మారిషస్ దేశాలకు చెందిన 18 పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande