30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు-మోసపూరిత పథకాల యాప్ మోసగిస్తోందనే ఆరోపణ
దిల్లీ: 02,మే ,(హిం.స) క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్
30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు-మోసపూరిత పథకాల యాప్ మోసగిస్తోందనే ఆరోపణ


దిల్లీ: 02,మే ,(హిం.స) క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకు ఇవి కొనసాగాయి. రెండు కంపెనీలు, వాటి డైరెక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి. లాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని, పెద్దఎత్తున ఈ-మెయిల్ ఖాతాలను స్తంభింపజేశామని వివరించాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యూపీ, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, దిల్లీ తదితర చోట్ల సోదాలు జరిగాయి.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande