పార్టీ మారిన ఇంద్రకరణ్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యేబాల్క సుమన్ ఫైర్
హైదరాబాద్ మే2 (హిం.స) బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించి, ఇప్
పార్టీ మారిన ఇంద్రకరణ్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యేబాల్క సుమన్ ఫైర్


హైదరాబాద్ మే2 (హిం.స)

బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. బాల్క సుమన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.

ఇంతకన్న నీతిమాలిన, సిగ్గుమాలిన చర్య ఉండదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయనకు రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారు. 75 ఏండ్ల వయసులో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఆయన చేసేది ఏం ఉంటది..? ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్నోళ్లకు మంత్రులుగా అవకాశం రాలేదు. కానీ ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రిగా అవకాశం కల్పించారు. కేసీఆర్ ఆయనను ఎంతో ఆదరించారు. ఇవాళ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉంది. ఆయనకు తగిన రీతిలో బుద్ది చెప్పాలి అని బాల్క సుమన్ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలి. ఐకే రెడ్డి లాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల ఆ పార్టీ మలినమైపోతోంది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ పదేండ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం కష్టపడ్డ వారి హృదయాలు బాధపడుతున్నాయి. ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఐకే రెడ్డి నిర్ణయం తప్పుడు నిర్ణయం. ప్రజలే ఆయనకు సమాధానం చెబుతారని బాల్క సుమన్ తెలిపారు.

నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో మా పార్టీ నాయకులు ఉన్నారు. ఆ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో వెళ్తుందని సునీల్ కనుగోలు చెబుతున్నారు. ఈ ప్రభావం అన్ని సీట్లపై పడుతోంది. మల్కాజిగిరిలో సునీతా మహేందర రెడ్డి, సికింద్రాబాద్లో దానం నాగేందర్, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, వరంగల్లో కడియం కావ్య.. ఈ నలుగురిని మా పార్టీ నుంచి తీసుకుని పోయారు. ఆ నియోజకవర్గాల్లో థర్డ్ప్లేస్కు వెళ్తూ- కాంగ్రెస్ పార్టీని ముంచుతున్నట్లు నాలుగు రోజుల క్రితం సునీల్ కనుగోలు రిపోర్టు ఇచ్చారని బాల్క సుమన్ చెప్పారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande