సూరత్‌ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
అహ్మదాబాద్‌: సూరత్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకట
సూరత్‌ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ


అహ్మదాబాద్‌: సూరత్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్‌ హైకోర్టు నిరాకరించింది. పిల్‌గా కాకుండా ఎలక్షన్‌ పిటిషన్‌గా దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సునీతా అగర్వాల్‌, జస్టిస్‌ అనిరుద్ధ మాయీ ధర్మాసనం సూచించింది. అభ్యర్థి ఏకగీవ్రంగా ఎన్నిక కావడమనే ప్రక్రియను పిటిషనర్‌ సవాల్‌ చేస్తున్నందున ఎలక్షన్‌ పిటిషన్‌గానే విచారణ చేపట్టాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అత్యవసరంగా విచారణ జరపాలంటూ చేతులు కట్టుకుని న్యాయవాది ప్రాథేయపడడంపై చీఫ్‌ జస్టిస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande