తెలుగు రాష్ట్రాల్లో 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత వడ దెబ్బతో 10 మంది మృతి
హైదరాబాద్ మే 4 (హిం.స) తెలుగు రాష్ట్రాల్లో చండ ప్రచండమైన తీవ్రతతో భానుడు భగ్గుమంటున్నాడు. రోహిణి కార
తెలుగు రాష్ట్రాల్లో 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత వడ దెబ్బతో 10 మంది మృతి


హైదరాబాద్ మే 4 (హిం.స)

తెలుగు రాష్ట్రాల్లో చండ ప్రచండమైన తీవ్రతతో భానుడు భగ్గుమంటున్నాడు. రోహిణి కార్తెలో రోల్లు పగులుతాయి అనే నానుడి వినే ఉంటాం.. కానీ రోహిణి కార్తె రానే లేదు.. అప్పుడే రోళ్లు పగిలేలా ఎండలు మండుతున్నాయి. ఏపీ, తెలంగాణలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి తీవ్రతకు తెలంగాణలోని రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అటు ఏపీలోనూ వేడి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలోని 58 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ బారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తెలంగాణలో మండుతున్న ఎండలు, వడదెబ్బ కారణంగా శుక్రవారం పది మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande