ఐపీఎల్ నందు నేడు 50వ మ్యాచ్.. రాజస్థాన్ మరియు హైదరాబాద్ జట్ల మధ్య పోటీ
తెలంగాణ: క్రీడలు మే 4 (హిం.స) ఐపిఎల్ లో సరిగ్గా 50వ మ్యాచ్ నేడు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ వర్సెస్ హైదరాబ
ఐపీఎల్ నందు నేడు 50వ మ్యాచ్.. రాజస్థాన్ మరియు హైదరాబాద్ జట్ల మధ్య పోటీ


తెలంగాణ: క్రీడలు మే 4 (హిం.స)

ఐపిఎల్ లో సరిగ్గా 50వ మ్యాచ్ నేడు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంతవరకు ఒకే ఒక మ్యాచ్ ఓడి, సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ అప్రతిహితంగా సాగిపోతోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ ల్లో విజయం సాధించి నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ వరుసగా మూడు మ్యాచ్ లు ధనాధన్ గెలిచి, ఒక్కసారిగా చతికిల పడింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. ప్రస్తుతం 5 వ స్థానంలో ఉంది. మరి ముందు కెళుతుందా? తిరిగి రేస్ లోకి వస్తుందా? లేదా అన్నది చూడాలి.

నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ

స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి జరగనుంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 18 మ్యాచ్ లు జరిగాయి.

రాజస్థాన్ 9 మ్యాచ్ లు, హైదరాబాద్ 9 మ్యాచ్లు గెలిచాయి. ఈ లెక్కన చూస్తే రెండు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయి.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande