తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ మే 4 (హిం.స)తెలంగాణలో రికార్డ్ స్థాయిలో దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్ల
తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు


హైదరాబాద్ మే 4 (హిం.స)తెలంగాణలో రికార్డ్ స్థాయిలో దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో అత్యధికంగా 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రానున్న మరో మూడు రోజులు రాష్ట్రంలో తీవ్ర వడాల్పులు ఉండనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఈక్రమంలో 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పింది. మూడు, నాలుగు రోజులపాటు ప్రజలు అప్రమతంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande