25 కిలోల బంగారాన్ని భారత్కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం
ముంబయి: భారత్లోని అఫ్గానిస్థాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్ధక్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఇటీవల
25 కిలోల బంగారాన్ని భారత్కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం


ముంబయి: భారత్లోని అఫ్గానిస్థాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్ధక్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఆమె రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని భారత్కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల సమాచారంతో ఆమెను అడ్డుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు.. ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ముంబయిలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

వార్ధక్ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు లభించింది. అయితే, ఎయిర్పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు.

హిందుస్థాన్ సమాచార -నాగరాజ్


 rajesh pande