తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఎండ దెబ్బ. బడా నాయకులకు తప్పని తిప్పలు
హైదరాబాద్: మే 4 (హిం.స) తెలంగాణలో బడా నాయకుల సభలకు ప్రజలను తీసుకు రావడం ఇప్పుడు చాలా పార్టీలకు కష్టమ
తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఎండ దెబ్బ. బడా నాయకులకు తప్పని తిప్పలు


హైదరాబాద్: మే 4 (హిం.స)

తెలంగాణలో బడా నాయకుల సభలకు ప్రజలను తీసుకు రావడం ఇప్పుడు చాలా పార్టీలకు కష్టమైపోయింది. దాంతో అనేక సభలను, రోడ్ షోలను తగ్గించేసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది. ఎండలు ఇటు తెలంగాణలోనూ,అటు ఆంధ్రలోనూ రాజకీయ పార్టీల ప్రచారానికి పెద్ద అడ్డంకిగా తయారయ్యాయి. ఆంధ్రలోనైతే అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ కూడా దాటుతోంది. వడ దెబ్బకి ఇరు రాష్ట్రాలలో అనేక మంది చనిపోయారు కూడా. వచ్చే వారం అయితే ఎండలు మరింత తీవ్రం కానున్నాయి.

మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ప్రజలు బయట తిరగొద్దని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 తర్వాత నుంచి సాయంత్రం 5.00 వరకు ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. నంద్యాల జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రత 47.7 డిగ్రీల సెల్సియస్ దాటింది. ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి.

తెలంగాణలో కూడా గరిష్ఠంగా 42 డిగ్రీల సెల్సియస్ ఎండలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 3 నుంచి 4 పబ్లిక్ మీటింగ్ లలో ప్రసంగిస్తున్నారు. ఆయన తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదనే చెప్పాలి.ఆయన హెలికాప్టర్ ద్వారా

నియోజకవర్గాలకు చేరకుంటున్నారు.


 rajesh pande