ఐపీఎల్ నేడు డబుల్ ధమాకా.. పంజాబ్ వర్సెస్ చెన్నై మరియు లక్నో వర్సెస్ కోల్కత్తా జట్ల మధ్య పోటీ..
హైదరాబాద్ మే 5 (హిం.స) ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో పంజ
ఐపీఎల్ నేడు డబుల్ ధమాకా.. పంజాబ్ వర్సెస్ చెన్నై మరియు లక్నో వర్సెస్ కోల్కత్తా జట్ల మధ్య పోటీ..


హైదరాబాద్ మే 5 (హిం.స)

ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్.. రాత్రి మ్యాచ్లో లక్నో, కేకేఆర్ తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్కు ధర్మశాల మైదానం వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అటల్ బిహారీ స్టేడియంలో జరుగనుంది.పంజాబ్, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్లో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్, 12న రాజస్థాన్ రాయల్స్, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.

పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ఈ మ్యాచ్లో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది.

టెక్నికల్గా పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్ప అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్లో పంజాబ్.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్ రాయల్స్ (మే 15), సన్రైజర్స్ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 14 మ్యాచ్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్లో పంజాబ్ సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande