360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్‌
దిల్లీ: 05:మే (హింస) లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్‌


దిల్లీ: 05:మే (హింస) లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్‌) నివేదిక పేర్కొంది. వీరిలో 274 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. నాలుగో దశలో బరిలో నిలిచిన 1,717 మంది అభ్యర్థుల్లో 1,710 మంది ప్రమాణపత్రాలను ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌లు విశ్లేషించాయి. 1,710 మందిలో 476 మందికి రూ.కోటి అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉండగా, వారిలో రూ.5,700 కోట్లకుపైగా ఆస్తులతో గుంటూరులో తెదేపా తరఫున పోటీచేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. 24 మంది తమకెలాంటి ఆస్తులూ లేవని ప్రకటించారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande