నేటి నుండి రైతుల ఖాతాల్లో జమ కానున్న రైతుబంధు పెండింగ్ బకాయిలు
హైదరాబాద్ మే 6 (హిం.స) రైతు బంధు పెండింగ్ బకాయిలను నేటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
నేటి నుండి రైతుల ఖాతాల్లో జమ కానున్న రైతుబంధు పెండింగ్ బకాయిలు


హైదరాబాద్ మే 6 (హిం.స)

రైతు బంధు పెండింగ్ బకాయిలను నేటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 3 రోజులపాటు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్లో పంటలు నష్టపోయిన రైతులకూ నేటి నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనుంది. ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

కాగా పంట నష్టానికి గురైన రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. కాగా తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా పది జిల్లాల్లో 1,58,121 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మార్చి నెలలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్లో పంటలు నష్టపోయిన రైతులకు నేటి నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనుంది. ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande