కాంగ్రెస్, బిజెపిల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ మే:7(హిం స) *కాంగ్రెస్, బిజెపిల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు*
*కాంగ్రెస్, బిజెపిల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు*


తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ మే:7(హిం స)

*కాంగ్రెస్, బిజెపిల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు*

*lకంసాన్ పల్లి ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మంగళ వారం ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. నాడు తెలంగాణ పల్లెలని పచ్చని పంటలతో కళకళలాడేవని, నేడు అవే పల్లెల్లో కరువు తాండవిస్తుందని, ఎక్కడ చూసినా ఎండిన పంటలు, ఎండుతున్న బోరుబావులు కనిపిస్తున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల పనితీరు, నేటి పాలకుల పనితీరును గుర్తించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. టిఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగితే, నేటి కాంగ్రెస్ పాలనలో కెసిఆర్ ఏ లక్ష్యంగా, ఆయనపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏం చేస్తారో చెప్పడంలేదని వాపోయారు. ఎన్నికల ప్రచారంలో గ్రామాల ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే మాజీ సీఎం కేసీఆర్ పై ఎంత అభిమానం ఉందో తెలుస్తుందని, ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని విషయం స్పష్టమవుతుందని అన్నారు. గతంలో కాలానుగుణంగా, ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మాట అనే పదం లేకుండా పాలన చేస్తుందని వాపోయారు. గడిచిన నాలుగు నెలల్లోనే గ్రామాలలో అస్తవ్యస్తమైన పాలన కొనసాగుతుందని, ప్రజలు అన్ని విషయాలను గమనించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఏనాడు కూడా పాలమూరు ప్రజల బాగును కోరుకొని బిజెపి పార్టీ, మతాల పేరుతో రాజకీయాలు చేసే మోడీ ప్రభుత్వానికి పాలమూరు ప్రజల ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. ఈ వారం రోజులపాటు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, నాయకుడు ఓ సైనికుడై పనిచేయాలని, టిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, నేటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande