కేరళలో కలకలం సృష్టిస్తున్న నకిలీ ఆధార్ కార్డులు
కేరళ మే 8 (హిం.స)కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 వేల మంది శరణార్థులకు నకిల
కేరళలో కలకలం సృష్టిస్తున్న నకిలీ ఆధార్ కార్డులు


కేరళ మే 8 (హిం.స)కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజన్స్ వెల్లడించింది. కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్కు చెందిన 50 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్లు ఉన్నట్లు తన రిపోర్టులో పేర్కొంది. అస్సాం, బెంగాల్, కేరళలోని ఆధార్ కేంద్రాల్లో ఈ నకిలీ కార్డులను సృష్టిస్తున్నట్లు రిపోర్టులో తెలిపింది.

కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్కు చెందిన శరణార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ దేశంలో నివాసం ఏర్పుచుకునేందుకు శరణార్థులు నకిలీ ఆధార్ కార్డులను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మిలిటెరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బోర్డర్ సెక్యూర్టీ దళం తన నిఘాను పెంచింది. సరిహద్దు రాష్ట్రాల్లోనే నిఘాను పెంచేశారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోనూ ఇండియన్ కోస్టు గార్డులు నిఘాను పెంచారు.

. బెంగాల్, జార్ఖండ్ నుంచి ఐపీ అడ్రెస్లతో కేరళలో ఆధార్ కేంద్రాలను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. కేరళ పోలీసులు ఇవాళ వందల సంఖ్యలో నకిలీ ఆధారు కార్డులను సీజ్ చేశారు. ఆధార్ చట్టం ప్రకారం నకిలీ కార్డు కలిగిన వారికి మూడేళ్ల జైలు లేదా లక్ష జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. దేశంలోకి అక్రమంగా రావడమే కాకుండా నకిలీ ఆధార్లు సైతం తీసుకుంటురు. ఈ అంశాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande