మేటి గడ్డ బ్యారేజీ పై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసిన నిపుణుల కమిటీ
హైదరాబాద్ మే 8 (హిం.స)గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో
మేటి గడ్డ బ్యారేజీ పై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసిన నిపుణుల కమిటీ


హైదరాబాద్ మే 8 (హిం.స)గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కాళేశ్వరం నాణ్యత లోపాలపై అధ్యయనం చేసేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ.. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్

చంద్రశేఖర్ అయ్యర్ ఛైర్మన్గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తాజాగా ఈ నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి బ్యారేజీ గురించి కీలక సిఫార్సు చేసింది. కాళేశ్వరంలో

భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలని చెప్పింది. మిగిలిన ఆరు గేట్లను పూర్తిగా పైకి ఎత్తి

ఉంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇలా చేయడంలో సమస్య వస్తే ఆ గేట్లను కూడా తొలగించాలంది. దెబ్బతిన్న సీసీ బ్లాకులు తీసేసి మళ్లీ కొత్తగా అమర్చాలంది. ఆప్రాన్కు మరమ్మతులు, గ్రౌటింగ్ సహా అనేక పునరుద్ధరణ పనులను వర్షాకాలంలోగా చేపట్టాలని చెప్పింది. వర్షాకాలంలోగా మరమ్మతులు చేయకుంటే బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున తక్షణం

చేపట్టాల్సిన చర్యలతో మధ్యంతర నివేదిక

ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2019 నుంచే కాళేశ్వరం బ్యారేజీలకు నష్టం వాటిల్లడం ప్రారంభమైందని నిపుణుల కమిటీ గుర్తించింది.అయితే నీటిని ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టలేదని.. వర్షాకాలంలోగా కొన్ని దిద్దుబాటు

చర్యలు చేపట్టడంతోపాటు ఈ పరిస్థితికి గల కారణాలను లోతుగా అన్వేషించడానికి బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించాలని చెప్పింది. మేడిగడ్డ ఏడో బ్లాక్ పునరుద్ధరణకు తాము సూచిస్తున్నవి మధ్యంతర, తాత్కాలిక

చర్యలు మాత్రమేనని చెప్పింది. ఈ చర్యలు ఇప్పటికే దెబ్బతిన్న బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా చూడటానికేనని వెల్లడించింది.

అయితే స్ట్రక్చర్లో అనూహ్యమైన పరిణామాలు సంభవించి ఇంకా తీవ్రంగా నష్టం జరిగే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని నిపుణల కమిటీ తేల్చింది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande