వరల్డ్ కప్ విశ్వ విజేత టీమిండియాను ప్రశంసించిన పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ ఆఫ్రిది.
తెలంగాణ క్రీడలు జూలై 4 (హిం.స)టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి టీమిండియా
వరల్డ్ కప్ విశ్వ విజేత టీమిండియాను ప్రశంసించిన పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ ఆఫ్రిది.


తెలంగాణ క్రీడలు జూలై 4 (హిం.స)టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే,ఫైనల్లో టీమిండియా అద్భుతమైన ఆటతీరును

కనబరించిందని పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రీది ప్రశంసలు కురిపించారు. ''ఫైనల్ మ్యాచ్ చివరివరకు చూశా. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.అయితే, ఒత్తిడిని తట్టుకుని ఏ జట్టు రాణిస్తుందో ఆ

జట్టు విజేతగా నిలుస్తుంది. టీ20 వరల్డ్ కప్

ఫైనల్లోనూ అదే జరిగింది. భారత్ మరోసారి తన బ్రాండ్ క్రికెట్తో ప్రత్యర్థిని చిత్తుచేసి విజయం సాధించింది. వరల్డ్ కప్ను అందుకునేందుకు దాయాది దేశానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక పాక్ జట్టు

విషయానికొస్తే మేము కొన్ని తప్పులు చేశాం. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది'' అని షహీన్ అఫ్రీది

తెలిపారు. కాగా, యూఎస్ఏ, భారత్ చేతిలో ఓటమితో గ్రూప్ స్టేజీలోనే పాకిస్తాన్ ఇంటిబాట పట్టడం తెలిసిందే..

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande