నటి హేమా పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న మా
వినోదం: 23 ఆగస్టు (హి.స.) బెంగుళూర్ రేవ్ పార్టీలో దొరికిన తెలుగు నటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కేసులో ఇరుకున్న తర్వాత హేమపై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం ఆ సస్పెన్షన్ ను ఎత్తేస్తూ 'మ
నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేత


వినోదం: 23 ఆగస్టు (హి.స.)

బెంగుళూర్ రేవ్ పార్టీలో దొరికిన

తెలుగు నటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కేసులో ఇరుకున్న తర్వాత హేమపై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం ఆ సస్పెన్షన్ ను ఎత్తేస్తూ 'మా' కీలక నిర్ణయం తీసుకుంది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతక ముందు హేమపై సస్పెన్షన్ ఎత్తివేతకు మా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అయితే మూడు రోజుల కింద నటి హేమ డ్రగ్స్ కేసులో తన తప్పేం లేదంటూ, నిరపరాధిగా బయటకు వస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం.. ఇపుడు హేమపై సస్పెన్షన్ ఎత్తివేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత మేలో బెంగుళూరులోని ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న రెవ్ పార్టీలో నటి హేమ పట్టుబడింది. డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ గా తేలడంతో బెంగుళూర్ పోలీసులు కేసు నమోదు చేయగా, బెయిల్ పై బయటికి వచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్ / నాగరాజ్ రావు


 rajesh pande