అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)
కాకినాడ, సెప్టెంబర్ 10: భారీ వర్షాలతో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. 216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు ఇతర అనుబంధ పంట కాలువలకు పది చోట్లకి పైగా గండ్లు పడ్డాయి.
గొల్లప్రోలు పట్నంలోని మార్కండేయపురంలోకి ఏలేరు వరద నీరు ప్రవేశించాయి. గొల్లప్రోలు పట్టణ శివారులో ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై కూడా ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది.గొల్లప్రోలు పట్టణ శివారులోని వేరుశెనగ మిల్లులోకి వరద నీరు ప్రవేశించింది.ఏలేరు ఒకవైపు .. శుద్ధ గడ్డ మరోవైపు ముంచెత్తడంతో పంట పొలాల్లో భారీగా ముంపుపెరిగింది. గొల్లప్రోలు జగనన్న కాలనీ సూరంపేటలకు వెళ్లే రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరైంది. శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బలిమెల
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల