హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం దేవర శుక్రవారం థియేటర్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చిన చిత్రమిది. విడుదలైన ఫస్ట్ షో నుంచి పాజిటీవ్ టాక్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసే కలెక్షన్స్ రాబట్టింది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు అదిరిపోయాయని ఫ్యాన్స్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ అదిరిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవర హిట్ అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. 'దేవర' తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే ఓపెనింగ్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫస్ట్ డే దేవరకు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు వసూలు చేసినట్లు అంటున్నారు. ఇండియాలో అన్ని భాషలలో కలిపి దాదాపు రూ.77 కోట్లు నెట్ అందుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూలు చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిన్న ఒక్కరోజే రూ.68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. ఇతర భాషలలో హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, తమిళంలో రూ.0.8 కోట్లు, మలయాళంలో రూ.0.3 కోట్లు వచ్చినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..