అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)
రైల్వేస్టేషన్, : పండగల వేళ ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. తిరుపతి-శ్రీకాకుళంరోడ్ (07440) ప్రత్యేక రైలు అక్టోబరు 6 నుంచి జనవరి 1వ తేదీ వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 5.10గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7.55 గంటలకు దువ్వాడ వచ్చి..7.57గంటలకు వెళుతుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళంరోడ్-తిరుపతి (07441) ప్రత్యేక రైలు అక్టోబరు 7 నుంచి జనవరి 2వ తేదీ వరకు ప్రతి సోమవారం సాయంత్రం 3గంటలకు శ్రీకాకుళంరోడ్‌లో బయలుదేరి సాయంత్రం 6గంటలకు దువ్వాడ వచ్చి..6.02గంటలకు వెళుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల