హైదరాబాద్, 13 జనవరి (హి.స.)**
ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ
కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారి ఢిల్లీ నివాసంలో సోమవారం ఘనంగా సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
పలువురు కేంద్రమంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి రానున్నారు.
ఢిల్లీలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాల కేడర్ల తెలుగు అధికారులు, పాత్రికేయులు కూడా ఈ సంబరాల్లో పాల్గొననున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు