సిరిసిల్లలో టీ స్టాల్ మూసి వేయించిన ఘటన పై కేటీఆర్ మండిపాటు
రాజన్న సిరిసిల్ల. 19 ఫిబ్రవరి (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణం లో చిరు వ్యాపారి శ్రీనివాస్ టీస్టాల్ ను జిల్లా కలెక్టర్ మూసివేయించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా,
కేటీఆర్ ఫైర్


రాజన్న సిరిసిల్ల. 19 ఫిబ్రవరి (హి.స.)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణం లో చిరు వ్యాపారి శ్రీనివాస్ టీస్టాల్ ను జిల్లా కలెక్టర్ మూసివేయించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. పట్టణంలోని బతుకమ్మ ఘాట్కు ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లి... అక్కడ టీ స్టాల్లో ఉన్న తన ఫోటో చూసి కలెక్టర్ సహించలేక శ్రీనివాస్ టీ స్టాల్ ను మూసివేయించాడని కేటీఆర్ మండిపడ్డారు.

కాగా ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతో టీ స్టాల్ తొలగించామని మున్సిపల్ అధికారులు చెబుతుండగా...టీ స్టాల్లో కేటీఆర్ ఫోటో తీసేయమన్న ఆదేశాలు వినకపోవడంతోనే కలెక్టర్ అలా చేశాడని యజమాని శ్రీనివాస్ చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్

 rajesh pande