నెల్లూరు 3 ఏప్రిల్ (హి.స.),:అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ) హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులకు సహకరిస్తానని.. విచారణకు వస్తానని చెబుతూనే తప్పించుకుని తిరుగుతున్నారు మాజీ మంత్రి. మూడవ సారి కూడా పోలీసుల విచారణకు కాకాణి గైర్హాజరయ్యారు. అక్రమమైనింగ్ కేసులో ఇప్పటి వరకు మూడు సార్లు కాకాణికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనను కలిసి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించిన ప్రతీసారి కాకాణి మాత్రం తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. దీంతో ఆయన బంధువులకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల