హెచ్సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్, 3 ఏప్రిల్ (హి.స.) హెచ్సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ భూములపై ఇవాళ ఉదయం విచారణ జరిపిన కోర్టు మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశిస్తూ మధ్యాహ్నానికి వాయిదా
సుప్రీంకోర్టు


హైదరాబాద్, 3 ఏప్రిల్ (హి.స.)

హెచ్సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ భూములపై ఇవాళ ఉదయం విచారణ జరిపిన కోర్టు మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశిస్తూ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 3:40కి మరోసారి విచారణ ప్రారంభించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికను పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా సీరియస్ విషయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చిన సుప్రీం.. అక్కడ అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని నిలదీసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈనెల 16న తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande