రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల పక్షంగా పని చేస్తుంది.. మంత్రి సీతక్క
తెలంగాణ, ములుగు. 3 ఏప్రిల్ (హి.స.) రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల పక్షంగా పని చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్. దివాకర్, డీఎండీసీఎస్ఓ రాంపతిలతో కలిసి పర్యటించిన సీతక్క కమలాపురం దళితవాడలో రూ.5 లక్
మంత్రి సీతక్క


తెలంగాణ, ములుగు. 3 ఏప్రిల్ (హి.స.)

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

పేదల పక్షంగా పని చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్. దివాకర్, డీఎండీసీఎస్ఓ రాంపతిలతో కలిసి పర్యటించిన సీతక్క కమలాపురం దళితవాడలో రూ.5 లక్షలతో మంజూరైన 100 మీటర్ల సీసీ రోడ్డు పనులను, అనంతరం అంబేద్కర్ కాలనీలోని రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి మండల కేంద్రానికి చేరుకుని గిరిజన కో ఆపరేటివ్ రేషన్ షాపులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సన్న బియ్యం పంపిణీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande