రైతులు తొందరపడి దళారులకు ధాన్యం అమ్ముకోవద్దు.. మంత్రి పొంగులేటి
తెలంగాణ, ఖమ్మం. 3 ఏప్రిల్ (హి.స.) ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెం గ్రామంలో రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగ
మంత్రి పొంగులేటి


తెలంగాణ, ఖమ్మం. 3 ఏప్రిల్ (హి.స.)

ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెం

గ్రామంలో రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.

ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయడమే కాకుండా బోనస్ కూడా ఇస్తుందని తెలిపారు. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ధాన్యం పండించడం లో రెండో స్థానంలో నిలిచిందని, కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం పండించారని రైతులకు ప్రభుత్వం అండ దండగా నిలిచిందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande