వర్షానికి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, 3 ఏప్రిల్ (హి.స.) ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ ఎంసీ పర
Minister Ponnam


హైదరాబాద్, 3 ఏప్రిల్ (హి.స.)

ఉపరితల ఆవర్తన ప్రభావంతో

హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టి టీమ్స్ వాటిని క్లియర్ చేస్తుందని

పేర్కొన్నారు. సెక్రటేరియట్, రాజ్ భవన్ రోడ్, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో ఉన్న

వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు వెంట వెంటనే నీటిని తొలగించాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande