తెలంగాణ, ఆదిలాబాద్. 3 ఏప్రిల్ (హి.స.)
ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీ, శ్రీరామ్ కాలనీలలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేయడం అక్రమమని పేర్కొంటూ ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు.
ఈ సందర్భంగా రూ. 15,370 విలువ గల మద్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బెల్ట్ షాపుల నిర్వహణ చట్ట వ్యతిరేకమని, ఎవరైనా బెల్టాపులు నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు