హైదరాబాద్, 3 ఏప్రిల్ (హి.స.)
బీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు భారీ ఉపశమనం లభించింది. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్పై నమోదైన రైల్ రోకో కేసు ను హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉండగా.. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్లో రైల్లోకో చేపట్టారు. ఆ సమయంలో కేసు నమోదు చేసి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉంది. కేసీఆర్ పిలుపు మేరకే రైల్లోకో చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే, రైల్రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కేసీఆర్పై నమోదై ఉన్న కేసు కొట్టిపారేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్