తెలంగాణ, కరీంనగర్. 3 ఏప్రిల్ (హి.స.) ఎల్ఆర్ఎస్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రబుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకోవటానికి దరఖాస్తుదారులు ఆసక్తి చూపటంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకున్నాయి. దీంతో ఆయా దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించటంతో భారీగా ఆదాయం చేకూరింది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్ఆర్ఎస్ కింద 1.36 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఇందులో ఇప్పటి వరకు 28 వేలకు పైగా దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు. వీటి ద్వారా సుమారుగా రూ.92 కోట్ల మేరకు ఆదాయం చేకూరింది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 3786 దరఖాస్తుల ద్వారా రూ.22.54 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు