హైదరాబాద్, నల్గొండ. 3 ఏప్రిల్ (హి.స.)
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ
ఇండ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు చెందిన బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించినట్టు మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ జిల్లాలోని అనుముల గ్రామంలో సుమారు 1014 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణ విముక్తి కలిగించి ఇండ్ల హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో ఇందిరమ్మ ఇండ్లతోపాటు వివిధ పథకాల్లో మంజూరైన ఇండ్ల రుణాలను బ్యాంకులకు తమ ప్రభుత్వం చెల్లించి వాటి నుండి లబ్ధిదారులను విముక్తులను చేసిందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్