సిరిసిల్ల జిల్లాలో సమ్మె చేస్తున్న నేత కార్మికుల అరెస్ట్..
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 3 ఏప్రిల్ (హి.స.) కూలి రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న నేత కార్మికులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లు ప్రభుత్వం ఇచ్చింది.15 రోజులుగా
నేత కార్మికులు అరెస్ట్


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 3 ఏప్రిల్ (హి.స.)

కూలి రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న నేత కార్మికులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లు ప్రభుత్వం ఇచ్చింది.15 రోజులుగా ఉత్పత్తులు ప్రారంభమైన కార్మికుల కూలి రేట్లు నిర్ణయించకపోవడంపై కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. మూడు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు గురువారం చేనేత జౌలీ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన కార్మిక నాయకులతోపాటు నేత కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని తెలుసుకున్న మిగిలిన నేత కార్మికులంతా పోలీస్ స్టేషన్కు తరలివచ్చి ఆందోళన చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande