మరోసారి వాయిదా పడ్డ స్పేస్ ఎక్స్ ప్రయోగం
ఢీల్లీ, 11 జూన్ (హి.స.)స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం (Dragon spacecraft launch) మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం ఆక్సియమ్-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 10 మంగళవారం ఉదయం 8:22 గంట
మరోసారి వాయిదా పడ్డ స్పేస్ ఎక్స్ ప్రయోగం


ఢీల్లీ, 11 జూన్ (హి.స.)స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం (Dragon spacecraft launch) మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం ఆక్సియమ్-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 10 మంగళవారం ఉదయం 8:22 గంటలకు నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ (Kennedy Space Center) నుంచి జరగాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేయబడింది. ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అనంతరం బుధవారం (జూన్ 11, 2025) ప్రారంభించాల్సిన ఆక్సియం 04 మిషన్ మరోసారి వాయిదా పడింది.

రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ (Liquid oxygen leak) కారణంగా వాయిదా వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే త్వరలోనే మరో తేదిని ప్రకటిస్తామని స్పేస్ ఎక్స్ (Space Ex) స్పష్టం చేసింది. కాగా ఈ మిషన్ 14 రోజుల పాటు కొనసాగుతుంది మరియు నలుగురు సభ్యుల సిబ్బంది 60 ప్రయోగాలను నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande