డబుల్ డక్కర్ బస్సుల్లో కూర్చొని నగర అందాలను తిలకిస్తే ఆ.ఆనందం వేరు
అమరావతి, 5 జూన్ (హి.స.), విశాఖపట్నం: నగర అందాలను డబుల్‌ డెక్కర్‌ అద్దాల బస్సులో కూర్చొని తిలకిస్తే ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. శీతల బస్సుల్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సందర్శనీయ ప్రాంతాలను వీక్షించడం మరపురానిదే. ‘ఓపెన్‌ టాప్‌’ బస్సులో ప్రయాణం పర్యాట
డబుల్ డక్కర్ బస్సుల్లో కూర్చొని నగర అందాలను తిలకిస్తే ఆ.ఆనందం వేరు


అమరావతి, 5 జూన్ (హి.స.), విశాఖపట్నం: నగర అందాలను డబుల్‌ డెక్కర్‌ అద్దాల బస్సులో కూర్చొని తిలకిస్తే ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. శీతల బస్సుల్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సందర్శనీయ ప్రాంతాలను వీక్షించడం మరపురానిదే. ‘ఓపెన్‌ టాప్‌’ బస్సులో ప్రయాణం పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచనుంది. ఈ ఆనందాన్ని పంచే ‘హాప్‌ ఆన్‌ హాప్‌ ఆఫ్‌’ బస్సులు త్వరలో నగర రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఈ తరహా బస్సులు యూరప్‌ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మొత్తంగా మూడు బస్సులను పర్యాటక అవసరాలకు ఉపయోగించనున్నారు. బీచ్‌ రోడ్డు అందాలు, కైలాసగిరి సొగసులు, తొట్లకొండపై బౌద్ధ స్తూపాలు, భీమిలి బీచ్, ఎర్రమట్టి దిబ్బల ప్రత్యేకతలను ఎంచక్కా వీక్షించొచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande