ఎట్టకేలకు భక్తులను కరుణించిన మల్లన్న.. నేటి నుంచి ప్రీ స్పర్శ దర్శనం ప్రారంభం.. టోకెన్ విధానం అమలు
శ్రీశైలం , 1 జూలై (హి.స.)నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం అవుతుందని శ్రీశైల దేవస్థానం ఈ.ఓ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో లాగానే వారంలో 4
శ్రీశైలం


శ్రీశైలం , 1 జూలై (హి.స.)నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం అవుతుందని శ్రీశైల దేవస్థానం ఈ.ఓ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో లాగానే వారంలో 4 రోజుల పాటు అనగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో మధ్యాహ్నం గం.1.45 నుంచి 3.45 వరకు రెండు గంటల పాటు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కొనసాగుతుందని ఈ.ఓ శ్రీనివాసరావు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ శ్రీ మల్లికార్జున స్వామిని స్వయంగా స్పర్శించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనే ప్రతీ భక్తుడి కోరికకు అనుగుణంగా ఈ ఉచిత స్పర్శ దర్శనం సౌకర్యం పునః ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఉచిత దర్శనం కోసం ఏరోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకన్లను జారీ చేయబడుతాయన్నారు.

ఈ కంప్యూటరైజుడు టోకన్లలో భక్తుని పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ టోకన్లను ఉచిత దర్శనం ప్రవేశద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందనీ ఉచిత స్పర్శదర్శనాన్ని భక్తులను కేవలం ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతించనున్నారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతో ధరించవలసి వస్తుంది భక్తుల రద్దీ కారణంగా మహాశివరాత్రి, ఉగాది, దసరా మహోత్సవాలు, శ్రావణ మాసం, కార్తిక మాసంలతో పాటు ప్రభుత్వ సెలవు రోజులలో ఈ ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదని తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande