అమరావతి జూలై (హి.స.)ఈ రోజు ఏపీ బీజేపీలో మాజీ సీనియర్ నేత, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) పుట్టినరోజు ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu).. ఆయనకు 76వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు (Greetings) తెలిపారు.
సీఎం తన ట్వీట్ లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి దేశ అత్యున్నత స్థానానికి చేరిన అరుదైన వ్యక్తి వెంకయ్యనాయుడు. శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా.. ఇలా ఏ స్థాయిలో పనిచేసినా ప్రజాసేవే పరమావధిగా వెంకయ్యనాయుడు భావించారు. అది ఆయన ప్రత్యేకత. ఆ విశిష్ట వ్యక్తిత్వమే ఆయనకు రాజకీయాలలో ప్రత్యేకతను సంతరించి పెట్టింది. వెంకయ్యనాయుడు ఇలాంటి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, మరింత ప్రజా సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అని సీఎం తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి