అమరావతి, 13 జూలై (హి.స.):ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి వెబ్ ఆప్ష న్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ శనివారం అర్ధరాత్రి వరకూ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి..అనే జీవోలే విడుదల కాలేదు!.. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యాశాఖ ఇటీవల షెడ్యూలు వి డుదల చేసింది. తొలుత 10వ తేదీ నుంచి ఆప్షన్ల ఎంపిక ఉంటుందని ప్రకటించి, తర్వాత 13 తేదీకి వాయిదా వేసిం ది. దీంతో ఆప్షన్ల ఎంపికకు విద్యార్థులకు 6 రోజులే మిగిలాయి. అది కూడా నేడు ఆప్షన్లు ప్రారంభమైతేనే. ఉన్నత విద్యాశాఖ ఏఐసీటీఈ కేటాయింపులకు అనుగుణంగా అడ్మిషన్లు చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేయాలి. 2025-26కు ఫీజులపై జీవో కూడా ఇవ్వాలి. కానీ.. శనివారం అర్ధరాత్రి వరకు జీవో రాలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ